ఒక్కో బంతికి రూ.30 లక్షలు ఫైన్.. మూడోసారి ఉల్లంఘించిన ఎల్ఎస్‌జీ!
Wed May 28, 2025 16:37 Sports
మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ. 30 లక్షల ఫైన్ పడింది. లక్నో జట్టు స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో లక్నో జట్టుకు బీసీసీఐ జరిమానా వేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా లక్నో ప్లేయర్లు అందరికీ రూ. 12 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ సీజన్‌లో నియమావళిని మూడోసారి లక్నో జట్టు ఉల్లంఘించినట్లు ఐపీఎల్ తన ప్రకటనలో పేర్కొంది. అందుకే జట్టు కెప్టెన్ అయిన పంత్‌కు రూ. 30 లక్షలు ఫైన్ వేసినట్లు చెప్పింది. లక్నో జట్టులోని మిగతా ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా 50 శాతం ఫీజులో కోత విధించనున్నారు.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ కు ఘన నీరాజనం అర్పించిన పవన్ కల్యాణ్! తెలుగు సంస్కృతి, సినిమా, సామాజిక సేవల్లో..
కాగా, నిన్నటి హై స్కోరింగ్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఆరు వికెట్ల తేడాతో లక్నోపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. కానీ, ఆర్‌సీబీ ఈ భారీ లక్ష్యాన్ని నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి, మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఎల్ఎస్‌జీ సారథి రిషబ్ పంత్ అజేయ శతకం చేసినా తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అతడు 61 బంతుల్లో 118 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ 85 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ తో లక్నో జట్టుకు విజయాన్ని దూరం చేశాడు. ఈ సీజన్‌ను లక్నో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో ముగించింది. 14 మ్యాచులాడిన ఆ జట్టు 6 విజయాలు మాత్రమే నమోదు చేసింది. మరోవైపు ఆర్‌సీబీ ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లి, క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. గురువారం చండీఘడ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!
లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే!
ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Sports #teamindia
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.